Thursday, 24 September 2026
  • Home  
  • బీజేపీ జిల్లా కార్యదర్శి తమ్మెర రజనీ రెడ్డి భర్త పాపిరెడ్డి కన్నుమూత
- ఖమ్మం

బీజేపీ జిల్లా కార్యదర్శి తమ్మెర రజనీ రెడ్డి భర్త పాపిరెడ్డి కన్నుమూత

అకాల మరణంతో కుటుంబంలో విషాదం.. పాతర్లపాడులో నేడు అంత్యక్రియలు తిరుమలాయపాలెం: భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీమతి తమ్మెర రజనీ రెడ్డి గారి భర్త తమ్మెర పాపిరెడ్డి అకాల మరణం చెందారు. ఆయన మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో విషాదం నెలకొంది. పాపిరెడ్డి మృతి పట్ల బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకసంతప్త కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన రజనీ రెడ్డి కుటుంబానికి ఈ విషాద సమయంలో ధైర్యం, మనోస్థైర్యం కలగాలని ఆకాంక్షించారు. పాపిరెడ్డి అంత్యక్రియలు గురువారం తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలోని ఆయన స్వగృహంలో నిర్వహించనున్నట్లు బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు తెలిపారు.

అకాల మరణంతో కుటుంబంలో విషాదం.. పాతర్లపాడులో నేడు అంత్యక్రియలు

తిరుమలాయపాలెం: భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీమతి తమ్మెర రజనీ రెడ్డి గారి భర్త తమ్మెర పాపిరెడ్డి అకాల మరణం చెందారు. ఆయన మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో విషాదం నెలకొంది.

పాపిరెడ్డి మృతి పట్ల బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకసంతప్త కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన రజనీ రెడ్డి కుటుంబానికి ఈ విషాద సమయంలో ధైర్యం, మనోస్థైర్యం కలగాలని ఆకాంక్షించారు.

పాపిరెడ్డి అంత్యక్రియలు గురువారం తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలోని ఆయన స్వగృహంలో నిర్వహించనున్నట్లు బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.