పున్నమి ప్రతినిధి, వెదురుకుప్పం జూలై 21
తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెదురుకుప్పం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వెదురుకుప్పం మండలానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించినట్లు సమాచారం. మండల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని గురుసాల కిషన్ చంద్ కోరగా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని డాలర్స్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.


