చంద్రగిరి ఆగస్టు 06 ( పున్నమి ప్రతినిధి)
చంద్రగిరిలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



