నర్సంపేట నియోజకవర్గం. ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన వెంగళ లక్ష్మీ గారు వృద్ధాప్యంలో అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకున్న సర్పంచ్ దాసరి రమేష్ .బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసివారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుమారులు వెంగళ శ్యాంసుందర్, సాంబయ్య, శ్రీను గార్లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తక్కలపల్లి రమేష్. వార్డు సభ్యులుమైనార్టీ మండల అధ్యక్షులు అజహర్, గుండ్లపల్లి విజయ్, పార్టీ నాయకులు మొహీనుద్దిన్ చెన్నూరు సత్యం, కోయగూరీ కుమారస్వామి, గులాం మహమ్మద్. తదితరులు పాల్గొన్నారు.



