Friday, 15 May 2026
  • Home  
  • మన్ననలను పొందిన ది క్రైమ్ మినీ మూవీ – సామాజిక చైతన్యం ఇతివృత్తం – ప్రశంసలు పొందిన దర్శకులు గీతా ప్రసాద్
- విశాఖపట్నం

మన్ననలను పొందిన ది క్రైమ్ మినీ మూవీ – సామాజిక చైతన్యం ఇతివృత్తం – ప్రశంసలు పొందిన దర్శకులు గీతా ప్రసాద్

సామాజిక చైతన్యం పంచిన ది క్రైమ్ లఘు చిత్రం దర్శకుడు గీతా మోహన్ ( గీతా ప్రసాద్) ను అతిథులు ప్రశంసల్లో ముంచెత్తారు. రాంనగర్ లయన్స్ క్లబ్ ప్రాంగణం లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో ఆహుతుల మన్ననలను అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్య నారాయణ, రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వి.వి. రమణ మూర్తి, వి.డిజిటల్ బ్యూరో చీఫ్ ఎం.ఎస్.ఆర్ ప్రసాద్,స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ చిట్టిబాబు లు పాల్గొని మాట్లాడారు. స్థానిక కళాకారులతో నిర్మించిన చిత్రం లో సమాజానికి సందేశం ఇచ్చిందన్నారు. నిర్లక్ష్యం అనేది ఎన్ని జీవితాలను ప్రభావితం చేస్తుందనేది చిత్రంలో నటీనటులు ప్రదర్శించి మెప్పించారన్నారు. ఒక గంట నిడివి లో తీసిన ద క్రైమ్ లఘు చిత్రం మంచి సందేశాన్ని ఇచ్చిందన్నారు. సాంకేతికంగా లైటింగ్ వంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి స్థాయిలో మరింత గౌరవం పొందుతున్నారు. ఇమంది ఈశ్వరరావు వ్యాఖ్యానం తో జరిగిన కార్యక్రమం లో ద క్రైమ్ లఘు చిత్రం లో కొండపల్లి శ్రీనివాసరావు, రవితేజ కళా తృష్ణ, తేలు వెంకట రమణ మూర్తి, గరికిన రాజు, సూర్య కుమారి,షరీఫ్, కోటేశ్వరరావు, ప్రదీప్ రాజు, సాహితీ, దాక్షాయణి, ఎం. టి రాజు, రాజు వంగలా, సూర్య కుమార్, శాంతి, సునీత, శ్యాం, వెంకటేష్ తదితరులు నటించారు. ఆరిలోవ శ్రీనివాస్ మేకప్, కృష్ణం రాజు ప్రొడక్షన్ మానేజర్, చింతాడ ఉదయ్ కుమార్ సహాయ దర్శకుడు, డైలాగ్స్ ను అందించారు. హీరోయిన్ షన్ను తదితరులు సారధ్యం వహించిన కార్యక్రమంలో సర్వ శివ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ లఘు చిత్రం కు కథ, కథనం, మాటలు, కెమెరా, దర్శకత్వం వహించిన గీతా మోహన్ ( గీతా ప్రసాద్) మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఇతివృత్తాలను అందిస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంశాలను అందిస్తామన్నారు.

సామాజిక చైతన్యం పంచిన ది క్రైమ్ లఘు చిత్రం దర్శకుడు గీతా మోహన్ ( గీతా ప్రసాద్) ను అతిథులు ప్రశంసల్లో ముంచెత్తారు. రాంనగర్ లయన్స్ క్లబ్ ప్రాంగణం లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో ఆహుతుల మన్ననలను అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్య నారాయణ, రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వి.వి. రమణ మూర్తి, వి.డిజిటల్ బ్యూరో చీఫ్ ఎం.ఎస్.ఆర్ ప్రసాద్,స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ చిట్టిబాబు
లు పాల్గొని మాట్లాడారు. స్థానిక కళాకారులతో నిర్మించిన చిత్రం లో సమాజానికి సందేశం ఇచ్చిందన్నారు. నిర్లక్ష్యం అనేది ఎన్ని జీవితాలను ప్రభావితం చేస్తుందనేది చిత్రంలో నటీనటులు ప్రదర్శించి మెప్పించారన్నారు. ఒక గంట నిడివి లో తీసిన ద క్రైమ్ లఘు చిత్రం మంచి సందేశాన్ని ఇచ్చిందన్నారు. సాంకేతికంగా లైటింగ్ వంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి స్థాయిలో మరింత గౌరవం పొందుతున్నారు. ఇమంది ఈశ్వరరావు వ్యాఖ్యానం తో జరిగిన కార్యక్రమం లో ద క్రైమ్ లఘు చిత్రం లో కొండపల్లి శ్రీనివాసరావు, రవితేజ కళా తృష్ణ, తేలు వెంకట రమణ మూర్తి, గరికిన రాజు, సూర్య కుమారి,షరీఫ్, కోటేశ్వరరావు, ప్రదీప్ రాజు, సాహితీ, దాక్షాయణి, ఎం. టి రాజు, రాజు వంగలా, సూర్య కుమార్, శాంతి, సునీత, శ్యాం, వెంకటేష్ తదితరులు నటించారు. ఆరిలోవ శ్రీనివాస్ మేకప్, కృష్ణం రాజు ప్రొడక్షన్ మానేజర్, చింతాడ ఉదయ్ కుమార్ సహాయ దర్శకుడు, డైలాగ్స్ ను అందించారు. హీరోయిన్ షన్ను తదితరులు సారధ్యం వహించిన కార్యక్రమంలో సర్వ శివ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ లఘు చిత్రం కు కథ, కథనం, మాటలు, కెమెరా, దర్శకత్వం వహించిన గీతా మోహన్ ( గీతా ప్రసాద్) మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఇతివృత్తాలను అందిస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంశాలను అందిస్తామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.