Saturday, 29 August 2026
  • Home  
  • ఉద్యానవన పంటల సాగుతో లాభదాయక వ్యవసాయానికి ప్రోత్సహం: జిల్లా కలెక్టర్
- జనగాం

ఉద్యానవన పంటల సాగుతో లాభదాయక వ్యవసాయానికి ప్రోత్సహం: జిల్లా కలెక్టర్

ఉద్యానవన పంటల సాగుతో లాభదాయక వ్యవసాయానికి ప్రోత్సాహం:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ——————————————————————— జనగామ,ఆగష్టు 29, కూరగాయల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి* ఘనపూర్ (స్టేషన్) మండలంలోని శివునిపల్లి గ్రామంలో రైతు పొలాన్ని సందర్శించిన కలెక్టర్* *పందిళ్ల విధానంలో దొండ, పొట్లకాయ, సొరకాయ సాగు పరిశీలన* *పిచ్చి మొక్కల నియంత్రణ, తెగుళ్లు, నీటి యాజమాన్యంపై సూచనలు* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ, ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొని, రైతులు అధిక ఆదాయం పొందాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సూచించారు. శుక్రవారం, జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) మండలం, శివునిపల్లి గ్రామానికి చెందిన *రైతు పిట్టల రాజు* వ్యవసాయ క్షేత్రాన్ని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సందర్శించి, దొండ, సొరకాయ, పొట్లకాయ సాగును పరిశీలించారు. పందిళ్ల (Pandals) విధానంలో ఏర్పాటు చేసిన తోటను పర్యవేక్షించిన *కలెక్టర్*, తోట నిర్వహణ తీరు, పంట పెరుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. తోట ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని *రైతును* అభినందించిన *కలెక్టర్*, పంట మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి, కలుపు నియంత్రణ చేపట్టాలని సూచించారు. నీటి నిర్వహణ, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా రైతును పంట సాగు విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్, తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే ఎన్ని ఎకరాల్లో ఈ కూరగాయల పంటలను వేశారు? అని రైతును అడుగగా, పొట్లకాయ సాగు రెండు ఎకరాల్లో వేశామని, సొరకాయ సాగు ఒక ఎకరంలో వేశామని, దొండ కాయ సాగు అర ఎకరంలో వేశామని *రైతు, కలెక్టర్ కు* వివరించారు. అదే విధంగా పండిన కూరగాయలను ఎక్కడ విక్రయిస్తున్నారు? ఏ మార్కెట్లకు తరలిస్తున్నారు? ధరలు ఎలా ఉన్నాయి? అనే విషయాలపై కూడా సమగ్రంగా చర్చించారు. అనంతరం పొలంలో ఉన్న పత్తి పంటను కూడా పరిశీలించిన *కలెక్టర్*, పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యానవన పంటల సాగుతో లాభదాయక వ్యవసాయానికి ప్రోత్సాహం:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
———————————————————————
జనగామ,ఆగష్టు 29,
కూరగాయల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి*
ఘనపూర్ (స్టేషన్) మండలంలోని శివునిపల్లి గ్రామంలో రైతు పొలాన్ని సందర్శించిన కలెక్టర్*
*పందిళ్ల విధానంలో దొండ, పొట్లకాయ, సొరకాయ సాగు పరిశీలన*
*పిచ్చి మొక్కల నియంత్రణ, తెగుళ్లు, నీటి యాజమాన్యంపై సూచనలు*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ, ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొని, రైతులు అధిక ఆదాయం పొందాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సూచించారు.
శుక్రవారం, జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) మండలం, శివునిపల్లి గ్రామానికి చెందిన *రైతు పిట్టల రాజు* వ్యవసాయ క్షేత్రాన్ని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సందర్శించి, దొండ, సొరకాయ, పొట్లకాయ సాగును పరిశీలించారు.
పందిళ్ల (Pandals) విధానంలో ఏర్పాటు చేసిన తోటను పర్యవేక్షించిన *కలెక్టర్*, తోట నిర్వహణ తీరు, పంట పెరుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.
తోట ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని *రైతును* అభినందించిన *కలెక్టర్*, పంట మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి, కలుపు నియంత్రణ చేపట్టాలని సూచించారు. నీటి నిర్వహణ, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా రైతును పంట సాగు విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్, తదితర అంశాలపై ఆరా తీశారు.
అలాగే ఎన్ని ఎకరాల్లో ఈ కూరగాయల పంటలను వేశారు? అని రైతును అడుగగా, పొట్లకాయ సాగు రెండు ఎకరాల్లో వేశామని, సొరకాయ సాగు ఒక ఎకరంలో వేశామని, దొండ కాయ సాగు అర ఎకరంలో వేశామని *రైతు, కలెక్టర్ కు* వివరించారు.
అదే విధంగా పండిన కూరగాయలను ఎక్కడ విక్రయిస్తున్నారు? ఏ మార్కెట్లకు తరలిస్తున్నారు? ధరలు ఎలా ఉన్నాయి? అనే విషయాలపై కూడా సమగ్రంగా చర్చించారు.
అనంతరం పొలంలో ఉన్న పత్తి పంటను కూడా పరిశీలించిన *కలెక్టర్*, పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.