Sunday, 23 August 2026
  • Home  
  • జెడ్పీ నిధుల పనుల్లో నిబంధనల ఉల్లంఘన – జెడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి ఆరోపణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జెడ్పీ నిధుల పనుల్లో నిబంధనల ఉల్లంఘన – జెడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి ఆరోపణ

ఆత్మకూరు : ఆత్మకూరు మండలం అప్పారావుపాలెంలో రూ.25 లక్షల జెడ్పీ నిధుల పనుల అంచనాలు మార్చారని జెడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి ఆరోపణ. అధికారుల తీరుపై ఆగ్రహం. ఆత్మకూరు: ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను నిబంధనలకు విరుద్ధంగా మార్చి చేపట్టడం సరికాదని ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యురాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి అన్నారు. అప్పారావుపాలెం తూర్పు హరిజనవాడలో జడ్పీ నిధులతో సుమారు రూ.25 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న పనులను ఆదివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.స్థానికులతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు. తొలుత రూపొందించిన అంచనాలకు అనుగుణంగా కాకుండా పనుల స్వరూపాన్ని మార్చినట్లు పరిశీలనలో గుర్తించినట్లు ప్రసన్నలక్ష్మి తెలిపారు. కాలువలో నీరు వచ్చినప్పుడు పొంగి ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉన్న విధంగా నీటి ప్రవాహాన్ని మళ్లించేలా పనులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోందన్నారు.రెండు ప్రాంతాల్లో రోడ్డును కోసి నీటి ప్రవాహాన్ని మళ్లించినట్లు పేర్కొన్నారు. రూ.25 లక్షల జడ్పీ నిధులతో మంజూరైన పనులు అసలు అంచనాలు, సాంకేతిక నిబంధనలకు అనుగుణంగానే జరగాల్సి ఉందన్నారు. అంచనాల్లో మార్పులు చేసినట్లయితే వాటికి ఎవరి అనుమతులు ఉన్నాయో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా పనులు చేపట్టడం వల్ల వర్షాలు, కాలువలకు నీరు వచ్చిన సమయంలో ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందన్నారు. విచారణ చేయకుండానే ఫిర్యాదును ముగించారు ఈ అంశంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తాను ఫిర్యాదు సంఖ్య ఎన్‌ఎల్‌ఆర్‌202608031563తో ఫిర్యాదు చేసినట్లు ప్రసన్నలక్ష్మి తెలిపారు. అయితే ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండానే దానిని పరిష్కరించినట్లు చూపించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.పనులు జరుగుతున్నాయా లేదా అని నేను ఫిర్యాదు చేయలేదు. అసలు అంచనాల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అంచనాలను ఎందుకు మార్చారు? రెండు చోట్ల రోడ్డును ఎందుకు కోశారు? నీటి ప్రవాహాన్ని ఎందుకు మళ్లించారు? అనే అంశాలపై విచారణ చేయాలని కోరాను.కానీ అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఫిర్యాదును ముగించారు” అని ఆమె అన్నారు.ఫిర్యాదుపై సంబంధిత సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ ఇచ్చిన సమాధానంలో మంజూరు ఉత్తర్వుల ప్రకారం పనులు కొనసాగుతున్నాయి. అయితే ఫిర్యాదుదారు అంగీకారంపై సంతకం చేయడానికి సిద్ధంగా లేరు” అని పేర్కొన్నారని తెలిపారు. తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా, అంగీకారంపై సంతకం చేయడానికి సిద్ధంగా లేరనే కారణాన్ని చూపి ఫిర్యాదును ముగించడం సరికాదన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినప్పుడు సమస్యపై వాస్తవాలను తెలుసుకుని, క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కారం చూపాల్సి ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటే ఫిర్యాదును ముగించడం కాదు.. ప్రజల సమస్యను పరిష్కరించడం అని ప్రసన్నలక్ష్మి పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అసలు అంచనాలు, సాంకేతిక అనుమతులు, పనుల ఉత్తర్వులు, ప్రస్తుతం జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనుల స్వరూపాన్ని మార్చకూడదని ఆమె అన్నారు.

ఆత్మకూరు : ఆత్మకూరు మండలం అప్పారావుపాలెంలో రూ.25 లక్షల జెడ్పీ నిధుల పనుల అంచనాలు మార్చారని జెడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి ఆరోపణ. అధికారుల తీరుపై ఆగ్రహం.
ఆత్మకూరు: ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను నిబంధనలకు విరుద్ధంగా మార్చి చేపట్టడం సరికాదని ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యురాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి అన్నారు. అప్పారావుపాలెం తూర్పు హరిజనవాడలో జడ్పీ నిధులతో సుమారు రూ.25 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న పనులను ఆదివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.స్థానికులతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు. తొలుత రూపొందించిన అంచనాలకు అనుగుణంగా కాకుండా పనుల స్వరూపాన్ని మార్చినట్లు పరిశీలనలో గుర్తించినట్లు ప్రసన్నలక్ష్మి తెలిపారు. కాలువలో నీరు వచ్చినప్పుడు పొంగి ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉన్న విధంగా నీటి ప్రవాహాన్ని మళ్లించేలా పనులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోందన్నారు.రెండు ప్రాంతాల్లో రోడ్డును కోసి నీటి ప్రవాహాన్ని మళ్లించినట్లు పేర్కొన్నారు.

రూ.25 లక్షల జడ్పీ నిధులతో మంజూరైన పనులు అసలు అంచనాలు, సాంకేతిక నిబంధనలకు అనుగుణంగానే జరగాల్సి ఉందన్నారు. అంచనాల్లో మార్పులు చేసినట్లయితే వాటికి ఎవరి అనుమతులు ఉన్నాయో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా పనులు చేపట్టడం వల్ల వర్షాలు, కాలువలకు నీరు వచ్చిన సమయంలో ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందన్నారు. విచారణ చేయకుండానే ఫిర్యాదును ముగించారు ఈ అంశంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తాను ఫిర్యాదు సంఖ్య ఎన్‌ఎల్‌ఆర్‌202608031563తో ఫిర్యాదు చేసినట్లు ప్రసన్నలక్ష్మి తెలిపారు. అయితే ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండానే దానిని పరిష్కరించినట్లు చూపించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.పనులు జరుగుతున్నాయా లేదా అని నేను ఫిర్యాదు చేయలేదు. అసలు అంచనాల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అంచనాలను ఎందుకు మార్చారు? రెండు చోట్ల రోడ్డును ఎందుకు కోశారు? నీటి ప్రవాహాన్ని ఎందుకు మళ్లించారు? అనే అంశాలపై విచారణ చేయాలని కోరాను.కానీ అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఫిర్యాదును ముగించారు” అని ఆమె అన్నారు.ఫిర్యాదుపై సంబంధిత సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ ఇచ్చిన సమాధానంలో మంజూరు ఉత్తర్వుల ప్రకారం పనులు కొనసాగుతున్నాయి. అయితే ఫిర్యాదుదారు అంగీకారంపై సంతకం చేయడానికి సిద్ధంగా లేరు” అని పేర్కొన్నారని తెలిపారు. తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా, అంగీకారంపై సంతకం చేయడానికి సిద్ధంగా లేరనే కారణాన్ని చూపి ఫిర్యాదును ముగించడం సరికాదన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినప్పుడు సమస్యపై వాస్తవాలను తెలుసుకుని, క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కారం చూపాల్సి ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటే ఫిర్యాదును ముగించడం కాదు.. ప్రజల సమస్యను పరిష్కరించడం అని ప్రసన్నలక్ష్మి పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అసలు అంచనాలు, సాంకేతిక అనుమతులు, పనుల ఉత్తర్వులు, ప్రస్తుతం జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనుల స్వరూపాన్ని మార్చకూడదని ఆమె అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.