Sunday, 23 August 2026
  • Home  
  • ఛలో హైదరాబాద్ – విద్యార్థి గర్జనను జయప్రదం చేయండి జాతీయ కమిటీ సభ్యురాలు ఎం. మమత
- వరంగల్

ఛలో హైదరాబాద్ – విద్యార్థి గర్జనను జయప్రదం చేయండి జాతీయ కమిటీ సభ్యురాలు ఎం. మమత

వరంగల్: పాలిటెక్నిక్ విద్యా పరిరక్షణ కోసం ఆగస్టు 24న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న “ఛలో హైదరాబాద్ – విద్యార్థి గర్జన” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని SFI జాతీయ కమిటీ సభ్యురాలు ఎం. మమత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ , పాలిటెక్నిక్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.జీవో నం. 97ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యా సౌకర్యాలు కల్పించాలని కోరారు. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని, ఆగస్టు 24న ఇందిరా పార్క్‌లో జరిగే విద్యార్థి గర్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఎం. మమత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర కిరణ్ జిల్లా అధ్యక్షాకార్యదర్శులు వినోద్, పైసా గణేష్ , ఎస్ఎఫ్ఐ నాయకులు స్పందన, లత, తేజశ్రీ, భార్గవి, కీర్తన, పూజ, హిందూప్రియ, ఐశ్వర్య ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కమిటీ తదితరులు పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది

వరంగల్: పాలిటెక్నిక్ విద్యా పరిరక్షణ కోసం ఆగస్టు 24న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న “ఛలో హైదరాబాద్ – విద్యార్థి గర్జన” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని SFI జాతీయ కమిటీ సభ్యురాలు ఎం. మమత పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ , పాలిటెక్నిక్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.జీవో నం. 97ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యా సౌకర్యాలు కల్పించాలని కోరారు.
పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని, ఆగస్టు 24న ఇందిరా పార్క్‌లో జరిగే విద్యార్థి గర్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఎం. మమత పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర కిరణ్ జిల్లా అధ్యక్షాకార్యదర్శులు వినోద్, పైసా గణేష్ , ఎస్ఎఫ్ఐ నాయకులు స్పందన, లత, తేజశ్రీ, భార్గవి, కీర్తన, పూజ, హిందూప్రియ, ఐశ్వర్య ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కమిటీ తదితరులు పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.