ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసే చట్టాన్ని అమలు చేయడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సమాజాన్ని, ముఖ్యంగా చిన్నారులను రక్షించేందుకు ఆస్ట్రేలియా తీసుకున్న చర్య ప్రపంచానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కూడా వయోపరిమితి ఆధారంగా సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంకేతాలు లభించాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చిన్నారులకు హానికరమైన కంటెంట్‌ను నిరోధిస్తూ వయస్సు ఆధారంగా నియంత్రణలు అమలు చేసే విధానంపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం కొత్త చట్టం లేదా ప్రస్తుత ఐటీ నిబంధనల్లో మార్పులు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై భారత్‌లోనూ కఠిన నిబంధనల సంకేతాలు