( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
అనకాపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ నేత మలశాల భరత్‌కుమార్ జన్మదిన వేడుకలు గురువారం అనకాపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, పట్టణ నాయకులు, పంచాయతీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
గత రెండు మూడు రోజులుగా మలశాల భరత్‌కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో పేదలకు వస్త్రాల పంపిణీతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ డాక్టర్ బీశెట్టి సత్యవతి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, మళ్ల బుల్లిబాబు, వైఎస్సార్సీపీ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ జాజుల రమేష్ తదితరులు మలశాల భరత్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు, ఆశీస్సులతో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. భరత్‌కుమార్‌కు ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మలశాల భరత్‌కుమార్‌కు శుభాకాంక్షలు అందజేశారు.


