చక్కెర కర్మాగారాల భూముల నగదీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అమర్నాథ్, ధర్మశ్రీ
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )
విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడారు. సహకార చక్కెర కర్మాగారాల భూముల నగదీకరణకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోవాడ చక్కెర కర్మాగారంపై ఆధారపడుతున్న రైతులకు, ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
గోవాడ ఫ్యాక్టరీకి రైతులు, కార్మికులతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని వారు పేర్కొన్నారు. కర్మాగార ఆస్తులను విక్రయించి బకాయిలు చెల్లించడం కాకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు.


