శ్రీకాళహస్తి, జూన్ 09, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండల పరిధిలో అడవి పందుల వేట కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తొట్టంబేడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ నరసింహమూర్తి వెల్లడించారు. కత్తివారికండ్రిగ గ్రామానికి చెందిన కత్తి శివాజీ (47) ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో తప్పిపోయిన తన ఆవును వెతికేందుకు కుమారుడు సురేంద్రతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో మామిడి తోట వద్ద అడవి పందులను పట్టుకునేందుకు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు బీఎన్ కండ్రిగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితులైన మొలకల దొరబాబు, కత్తి గురువయ్య, కత్తి సుధాకర్లను అరెస్ట్ చేశారు. విచారణలో అడవి పందులను చంపేందుకు అనధికారికంగా విద్యుత్ కంచె ఏర్పాటు చేసినట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి విద్యుత్ వైర్లు, కర్ర మేకులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ, అడవి జంతువుల వేట కోసం అక్రమ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఎలక్ట్రిసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ తిమ్మయ్య, ఎస్సై బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అడవి పందుల వేటకు విద్యుత్ కంచె.. రైతు మృతి కేసులో ముగ్గురు అరెస్ట్