శ్రీకాళహస్తి, జూన్ 09, (పున్నమి న్యూస్) : చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నల్ల బెలూన్లు ఎగురవేసి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి పవిత్ర రెడ్డి బియ్యపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పవిత్ర రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రజాసేవలో చేసిన సేవలను గుర్తుచేస్తూ, పేదలకు అండగా నిలిచిన నాయకుడిగా కొనియాడారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు నివాళులర్పిస్తూ ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అలాగే ఈ నెల 12న జరగనున్న నియోజకవర్గ స్థాయి ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం- కాటంరెడ్డి పవిత్ర రెడ్డి