తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను తొట్టంబేడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ (MPDO) కార్యాలయ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల మధ్య బాబాసాహెబ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన మండల అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, సీనియర్ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అంబేద్కర్ ఆశయ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం-నివాళులర్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి