Monday, 28 September 2026
  • Home  
  • ఉప్పుటేరులో మునిగిన చైన్ మిషన్లు.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే!
- అనకాపల్లి

ఉప్పుటేరులో మునిగిన చైన్ మిషన్లు.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే!

పూడిమడకలో సుందరపు విజయ్‌కుమార్‌ పర్యటన.. మిషన్ల వెలికితీతకు ప్రత్యేక రిస్క్ ఆపరేషన్ పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) పూడిమడక: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలోని ఉప్పుటేరును ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ఉప్పుటేరులో ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు చైన్ మిషన్లు నీటిలో మునిగి చిక్కుకుపోయిన నేపథ్యంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. మునిగిపోయిన రెండు మిషన్లను సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్, రాష్ట్ర హోంమంత్రి, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేక రిస్క్ ఆపరేషన్ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. పూడిమడకలో జట్టి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని, అప్పటివరకు మత్స్యకారుల బోట్లు రాకపోకలు సాగించేందుకు తాత్కాలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల రాకపోకలకు సీసీ లేదా గ్రావెల్ రోడ్డు, అవసరమైన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హామీలపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.

పూడిమడకలో సుందరపు విజయ్‌కుమార్‌ పర్యటన.. మిషన్ల వెలికితీతకు ప్రత్యేక రిస్క్ ఆపరేషన్

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )

పూడిమడక: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలోని ఉప్పుటేరును ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ఉప్పుటేరులో ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు చైన్ మిషన్లు నీటిలో మునిగి చిక్కుకుపోయిన నేపథ్యంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు.
మునిగిపోయిన రెండు మిషన్లను సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్, రాష్ట్ర హోంమంత్రి, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేక రిస్క్ ఆపరేషన్ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. పూడిమడకలో జట్టి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని, అప్పటివరకు మత్స్యకారుల బోట్లు రాకపోకలు సాగించేందుకు తాత్కాలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మత్స్యకారుల రాకపోకలకు సీసీ లేదా గ్రావెల్ రోడ్డు, అవసరమైన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హామీలపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.