అనపర్తి, సెప్టెంబరు 3 (పున్నమి ప్రతినిధి): లక్ష్మీనరసాపురం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతిగృహం, భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. అన్నం, కూర నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కూరగాయలు, పెరుగు, చిక్కీలు, అరటిపండ్ల నాణ్యతను పరిశీలించారు. కొన్ని కూరగాయలు, అరటిపండ్లు నాణ్యత లేని స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. మెనూ అమలు, భోజనం తయారీ సమయం, స్టాక్ రిజిస్టర్, మెస్ నిర్వహణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన అంశాలను సంబంధిత అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని ఫ్యాన్లు, టైల్స్ తదితర సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.







