ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యాధునిక వైద్య సేవలను మరింత వేగంగా, మెరుగ్గా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలో ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొత్త క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి రావడంతో అత్యవసర చికిత్స అవసరమైన రోగులకు మెరుగైన సేవలు అందనున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.



