ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఈ స్థానాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంచార్జులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మహబూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను నియమించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో ప్రచారం నిర్వహించి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్పష్టం చేసింది.



