అతి భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు వెంటనే సెలవులు ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి గేడాం కేశవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులు, వాగులు, వంతెనలు దెబ్బతిన్నాయని తెలిపారు. విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి – గెడం కేశవ్