ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారి నివాసంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతికి వివిధ రకాల పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినం ప్రజల జీవితాల్లో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు, అభివృద్ధిని తీసుకురావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బైంసా మున్సిపల్ చైర్మన్ , ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ఎస్ఎస్ ఫ్యాక్టరీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

భైంసా ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ఘనంగా వినాయక ప్రతిష్ఠాపన