Tuesday, 15 September 2026
  • Home  
  • కొండ బిట్రగుంట ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండ బిట్రగుంట ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

బోగోలు మండలం, కొండ బిట్రగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి (కమిటీ) సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ, 6పునర్నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ…ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు.​అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ, క్యూలైన్లు మరియు దైవ దర్శన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆలయ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోఅరవరాధాకృష్ణ,ఆలయ చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి,ఆలయ అధికారులు,కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

బోగోలు మండలం, కొండ బిట్రగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి (కమిటీ) సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ, 6పునర్నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ…ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు.​అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ, క్యూలైన్లు మరియు దైవ దర్శన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆలయ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోఅరవరాధాకృష్ణ,ఆలయ చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి,ఆలయ అధికారులు,కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.