Sunday, 23 August 2026
  • Home  
  • పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో ఉదయగిరి మండలంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం ఎంపీడీవో కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయగిరిలోని 10 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి సౌకర్యాలను సమీక్షించారు. ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లపై వివరాలను సేకరించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఎన్నికల ఉన్నతాధికారులకు అందజేస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో తప్పులు, అభ్యంతరాలకు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై వివరాలు సమర్పించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో
ఉదయగిరి మండలంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం ఎంపీడీవో కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయగిరిలోని 10 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి సౌకర్యాలను సమీక్షించారు. ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లపై వివరాలను సేకరించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఎన్నికల ఉన్నతాధికారులకు అందజేస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో తప్పులు, అభ్యంతరాలకు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై వివరాలు సమర్పించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.