*”కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: కాకాణి పూజిత”**SPSR నెల్లూరు జిల్లా**తేది 21.08.2026**శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో పర్యటించిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత గారు*- కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ- వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మనోధైర్యంతో పోరాడాలి – రాష్ట్రంలో న్యాయం లేదు… పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదు- కూటమి నాయకులు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అజమాయిషీ చలాయిస్తున్నారు- అన్యాయాన్ని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులు ఇస్తూ, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు- రోడ్ల పరిస్థితి అత్యంత ఘోరం…- ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతున్నారు- బాగున్న రోడ్లను తవ్వి కాంట్రాక్టుల పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారు- కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుంది – ఎక్కడికి వెళ్లినా రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు- పటిష్టమైన పాలన అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది- ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహిస్తోంది- తిరిగి జగనన్న పాలన రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు- దేవుని దయ, ప్రజల ఆశీస్సులతో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో మళ్లీ మంచి రోజులు వస్తాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కాకాణి పూజిత గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాకాణి పూజిత గారు మాట్లాడుతూ: ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలు మనోధైర్యంతో పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.కూటమి పాలనలో వ్యవస్థలు అన్నీ పోలీసు వ్యవస్థ మరియు ఇతర రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదని ఆమె మండిపడ్డారు. అధికారులంతా ప్రభుత్వ పెద్దల తీవ్ర ఒత్తిడి మరియు అజమాయిషీ కింద పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు, నోటీసులు ఇస్తూ, అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పూజిత గారు పేర్కొన్నారు.సర్వేపల్లి నియోజకవర్గం లో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైందని, ప్రజలు ప్రయాణించాలన్నా, రోడ్లపైకి రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని విమర్శించారు. బాగున్న రోడ్లను కూడా తవ్వి, కాంట్రాక్టుల పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మరియు అసంతృప్తి వ్యక్తమవుతోందని కాకాణి పూజిత అన్నారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేదాంట్లో చూపించే శ్రద్దలో 10% రోడ్లు ,డ్రైనేజీలు బాగు చేసేందుకు ప్రయత్నిస్తే బాగుండేదని , ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రోడ్లు మరియు డ్రైనేజీల నిర్వహణ లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలని, ప్రజలందరూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.దేవుని దయ, ప్రజల ఆశీస్సులతో జగనన్న తిరిగి అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో మళ్లీ సంతోషకరమైన పరిస్థితులు నెలకొంటాయని ధీమా వ్యక్తం చేశారు.అక్కంపేటలో దండు అమర్నాథ్ రెడ్డి నూతన గృహప్రవేశానికి కాకాణి పూజిత గారు హాజరై, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు


