Sunday, 23 August 2026
  • Home  
  • కలశ్ వందన్ అభియాన్‌ను విజయవంతం చేయాలి-చిలుముల శ్రీకృష్ణ దేవరాయలు
- మంచిర్యాల

కలశ్ వందన్ అభియాన్‌ను విజయవంతం చేయాలి-చిలుముల శ్రీకృష్ణ దేవరాయలు

బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కలశ్ వందన్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవితో కలిసి మాట్లాడారు.సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకొని బిజెపి ఎస్సీ మోర్చా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని అన్నారు. సంత్ రవిదాస్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, కుల, వర్గ భేదాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. రవిదాస్ మహారాజ్ చూపిన సమరసత మార్గాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.కాశీలోని సంత్ రవిదాస్ మహారాజ్ జన్మ స్థలం సిర్ గోవర్ధనాపూర్ పవిత్ర క్షేత్రం నుంచి సేకరించిన మట్టితో పూజించిన పవిత్ర కలశాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు తెలిపారు. తెలంగాణకు చేరిన పవిత్ర కలశాన్ని రాష్ట్రంలోని 33 జిల్లాలకు తీసుకెళ్లి, ప్రతి ప్రాంతానికి సంత్ రవిదాస్ మహారాజ్ సందేశాన్ని చేరవేసేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.ఈ నెల 23న హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణలోని 33 జిల్లాలకు పవిత్ర కలశాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు,బీజేపీ జాతీయ,రాష్ట్ర నాయకులు,పార్టీ పదాధికారులు,హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల జిల్లా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి ‘కలశ్ వందన్ అభియాన్’ను విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి,మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్, ఎస్సీ మోర్చా నాయకులు గోమాస కమల, చింతకింది లావణ్య,కల్లేపల్లి నవీన్,నర్సింగ్,రాము స్వామి,అనిల్,ప్రసన్న,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.