కనిగిరి రిజర్వాయర్ మత్స్యకారుల సమస్యలను జిల్లా ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల విజయ చంద్ర తెలిపారు.సుమారు 1,800 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన కనిగిరి రిజర్వాయర్‌పై సంగం మండలంలోని పలు గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. అయితే సొసైటీ ఆర్థిక ఇబ్బందులతో పాటు లీజు మొత్తాన్ని చెల్లించలేకపోవడం, చేపల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయ చంద్ర తెలిపారు.మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసిన అనంతరం, వారి అభీష్టం మేరకు పలు ప్రతిపాదనలను జిల్లా ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్‌కు అందించి చర్చించారు. ముఖ్యంగా రూ.15 నుంచి రూ.16 లక్షల వరకు లీజు భారాన్ని భరించలేకపోతున్నందున, రిజర్వాయర్‌ను లైసెన్స్ విధానంలోకి మార్చి, మత్స్యకారులు వ్యక్తిగతంగా లైసెన్సులు తీసుకుని జీవనోపాధి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు అందుతున్న సంక్షేమ పథకాలు, పడవలు, వలలు తదితర ప్రయోజనాలను అర్హులైన వారికి అందించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఫిషరీస్ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.మత్స్యకారుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపేందుకు మరోసారి సమావేశమై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.

కనిగిరి రిజర్వాయర్ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి