ఓబులదేవరచెరువు: భారతీయ జనతా పార్టీ ఓబులదేవరచెరువు మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు శ్రీ వీరాంజనేయులు అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ చింత శరత్ కుమార్ రెడ్డి హాజరై పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీ రంగారెడ్డి, శ్రీ సోమశేఖర్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని సుపరిపాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరవేటి నరేష్ బాబు, సీనియర్ నాయకులు సి.రంగారెడ్డి,అశ్వత్తప్ప, మండల ప్రధాన కార్యదర్శి సురేష్, ఆకుతోటపల్లి కిష్టప్ప,నాగప్ప,జగదీష్,వేంకటశివ, ఆర్.లక్ష్మీనారాయణ,ఈ.ఓబులేసు,ఆర్.నరసింహులు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



