ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలకు త్వరలో ఆన్‌లైన్ లాగిన్‌లు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనకు సంబంధించిన ఆన్‌లైన్ విధానంపై సెర్ప్ అధికారులు గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది వితంతు పెన్షన్లకు, మరో 1.5 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లకు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో వితంతువులు, వృద్ధులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.
అంగ వైకల్య పెన్షన్ల విషయంలో సదరం సర్టిఫికెట్‌తో పాటు ఇతర అర్హతలను నిర్ధారించే అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర వృత్తి ఆధారిత పెన్షన్లకు సుమారు 60 నుంచి 70 వేల మంది అర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్‌లో స్వీకరించే దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అక్టోబర్ నుంచి వితంతు, వృద్ధాప్య పెన్షన్ల మంజూరుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన కేటగిరీలకు చెందిన అర్హులకు విడతల వారీగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.

ఏపీలో కొత్త పెన్షన్లకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలకు త్వరలో ఆన్‌లైన్ లాగిన్‌లు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనకు సంబంధించిన ఆన్‌లైన్ విధానంపై సెర్ప్ అధికారులు గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది వితంతు పెన్షన్లకు, మరో 1.5 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లకు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో వితంతువులు, వృద్ధులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అంగ వైకల్య పెన్షన్ల విషయంలో సదరం సర్టిఫికెట్‌తో పాటు ఇతర అర్హతలను నిర్ధారించే అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర వృత్తి ఆధారిత పెన్షన్లకు సుమారు 60 నుంచి 70 వేల మంది అర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌లో స్వీకరించే దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అక్టోబర్ నుంచి వితంతు, వృద్ధాప్య పెన్షన్ల మంజూరుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన కేటగిరీలకు చెందిన అర్హులకు విడతల వారీగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.

