Wednesday, 2 September 2026
  • Home  
  • విద్యతోనే సామాజిక మార్పు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య అందించాలి: మంత్రి తుమ్మల
- ఖమ్మం

విద్యతోనే సామాజిక మార్పు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య అందించాలి: మంత్రి తుమ్మల

రఘునాథపాలెం / ఖమ్మం రఘునాథపాలెం మండలం జింకలతండ గ్రామం వద్ద శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, భారతదేశ ఔన్నత్యం, విలువలను ప్రపంచానికి చాటేలా స్వామి నారాయణ గురుకుల పాఠశాల పనిచేస్తోందన్నారు. సంస్కారవంతమైన విద్యతో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. ప్రపంచానికి సంస్కారం చాటి చెప్పిన భారతదేశంలో ఆ విలువలను పరిరక్షించేందుకు స్వామి నారాయణ సేవలు ప్రశంసనీయమన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఖమ్మంలో పాఠశాల ఏర్పాటు జిల్లా విద్యార్థులకు వరమన్నారు. పాఠశాలకు ప్రభుత్వ స్థలం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.

రఘునాథపాలెం / ఖమ్మం

రఘునాథపాలెం మండలం జింకలతండ గ్రామం వద్ద శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, భారతదేశ ఔన్నత్యం, విలువలను ప్రపంచానికి చాటేలా స్వామి నారాయణ గురుకుల పాఠశాల పనిచేస్తోందన్నారు. సంస్కారవంతమైన విద్యతో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. ప్రపంచానికి సంస్కారం చాటి చెప్పిన భారతదేశంలో ఆ విలువలను పరిరక్షించేందుకు స్వామి నారాయణ సేవలు ప్రశంసనీయమన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఖమ్మంలో పాఠశాల ఏర్పాటు జిల్లా విద్యార్థులకు వరమన్నారు. పాఠశాలకు ప్రభుత్వ స్థలం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.