Sunday, 6 September 2026
  • Home  
  • ఈనెల 24వ తేదీన టాక్సీ, క్యాబ్, ఆటో బంద్, మోటార్ ట్రాన్స్పోర్ట్ సీనియర్ నాయకులు చిట్యాల ప్రేమ్ చందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
- రంగారెడ్డి

ఈనెల 24వ తేదీన టాక్సీ, క్యాబ్, ఆటో బంద్, మోటార్ ట్రాన్స్పోర్ట్ సీనియర్ నాయకులు చిట్యాల ప్రేమ్ చందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

పున్నమి: హైదరాబాద్, మోటార్ ట్రాన్స్పోర్ట్ సీనియర్ నాయకులు చిట్యాల ప్రేమ్ చందర్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ ఆగస్టు 24న రాష్ట్రవ్యాప్తంగా టాక్సీ, క్యాబ్, ఆటో బంద్‌కు పిలుపునిచ్చారు. టాక్సీ, క్యాబ్, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ బంద్‌కు అసోసియేషన్ నాయకులు, యూనియన్ నాయకులు, డ్రైవర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులను కలిసి ఆగస్టు 24న బంద్‌ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన అన్నారు. డ్రైవర్ల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డిమాండ్స్: 1) టాక్సీ, క్యాబ్, ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 2. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలి. 3. ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్ కు బదులుగా ప్రభుత్వమే ఒక కొత్త యాప్ను తీసుకురావాలి. 4. మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న అక్రమంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా నడస్తున్న టూవీల్లర్లను నిషేధించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలి. 5. మోటర్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంవత్సరానికి రూ.12వేలు ఇవ్వాలి. 6. రోజువారీగా ప్రజలకు సౌకర్యం కల్పించే ఆటో డ్రైవర్లకు ‘ఈ’ ఛలాన్ల నుంచి మినహాయించాలి. 7. గిగ్ &ఫ్లాట్ఫారం యాప్ ఆధారిత సోషల్ సెక్యూరిటీ బోర్డులో ఆటో, క్యాబ్ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. 8. యాక్సిడెంట్ బీమాను కొనసాగించాలి. సాధారణ మరణాలకు వర్తింపచేయాలి. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

పున్నమి: హైదరాబాద్, మోటార్ ట్రాన్స్పోర్ట్ సీనియర్ నాయకులు చిట్యాల ప్రేమ్ చందర్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ ఆగస్టు 24న రాష్ట్రవ్యాప్తంగా టాక్సీ, క్యాబ్, ఆటో బంద్‌కు పిలుపునిచ్చారు. టాక్సీ, క్యాబ్, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ బంద్‌కు అసోసియేషన్ నాయకులు, యూనియన్ నాయకులు, డ్రైవర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులను కలిసి ఆగస్టు 24న బంద్‌ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన అన్నారు. డ్రైవర్ల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
డిమాండ్స్:
1) టాక్సీ, క్యాబ్, ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
2. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలి.
3. ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్ కు బదులుగా ప్రభుత్వమే ఒక కొత్త యాప్ను తీసుకురావాలి.
4. మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న అక్రమంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా నడస్తున్న టూవీల్లర్లను నిషేధించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలి.
5. మోటర్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంవత్సరానికి రూ.12వేలు ఇవ్వాలి.
6. రోజువారీగా ప్రజలకు సౌకర్యం కల్పించే ఆటో డ్రైవర్లకు ‘ఈ’ ఛలాన్ల నుంచి మినహాయించాలి.
7. గిగ్ &ఫ్లాట్ఫారం యాప్ ఆధారిత సోషల్ సెక్యూరిటీ బోర్డులో ఆటో, క్యాబ్ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
8. యాక్సిడెంట్ బీమాను కొనసాగించాలి. సాధారణ మరణాలకు వర్తింపచేయాలి.
సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.