Monday, 31 August 2026
  • Home  
  • ఆత్మకూరుకు శాశ్వత తాగునీటి భరోసా… 20 ఎకరాల్లో భారీ స్టేడియం!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరుకు శాశ్వత తాగునీటి భరోసా… 20 ఎకరాల్లో భారీ స్టేడియం!

సోమశిల నుంచి కొత్త పైపులైన్‌కు ప్రతిపాదనలు – యువత కోసం క్రీడా ప్రాంగణం – అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఊతం: మంత్రి ఆనం . ఆత్మకూరు, ఆగస్టు 31: ఆత్మకూరు పట్టణ ప్రజల దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు గ్రామీణ యువత క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు భారీ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ మేరకు కీలక ప్రకటనలు చేశారు. సోమశిల నుంచి ఆత్మకూరుకు తాగునీటిని సరఫరా చేసేందుకు ఇప్పటికే ఉన్న పైపులైన్లకు అదనంగా మరో నూతన పైపులైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనలను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. కొత్త పైపులైన్ అందుబాటులోకి వస్తే ఆత్మకూరు పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆత్మకూరు పట్టణంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ స్టేడియం గ్రామీణ ప్రాంత యువతకు క్రీడా అవకాశాలను విస్తరించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఐటీడీఏ శిక్షణ కళాశాలకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త భవనాలు నిర్మించి గురుకుల తరగతులను అక్కడే నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆత్మకూరు బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం, అభయాంజనేయ స్వామి ఆలయ భవనానికి శంకుస్థాపన, టిడ్కో కాలనీలో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు త్వరలో ముహూర్తాలు ఖరారు చేస్తామని మంత్రి వెల్లడించారు.

సోమశిల నుంచి కొత్త పైపులైన్‌కు ప్రతిపాదనలు – యువత కోసం క్రీడా ప్రాంగణం – అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఊతం: మంత్రి ఆనం
.
ఆత్మకూరు, ఆగస్టు 31: ఆత్మకూరు పట్టణ ప్రజల దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు గ్రామీణ యువత క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు భారీ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ మేరకు కీలక ప్రకటనలు చేశారు.
సోమశిల నుంచి ఆత్మకూరుకు తాగునీటిని సరఫరా చేసేందుకు ఇప్పటికే ఉన్న పైపులైన్లకు అదనంగా మరో నూతన పైపులైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనలను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. కొత్త పైపులైన్ అందుబాటులోకి వస్తే ఆత్మకూరు పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆత్మకూరు పట్టణంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ స్టేడియం గ్రామీణ ప్రాంత యువతకు క్రీడా అవకాశాలను విస్తరించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఐటీడీఏ శిక్షణ కళాశాలకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త భవనాలు నిర్మించి గురుకుల తరగతులను అక్కడే నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఇక ఆత్మకూరు బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం, అభయాంజనేయ స్వామి ఆలయ భవనానికి శంకుస్థాపన, టిడ్కో కాలనీలో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు త్వరలో ముహూర్తాలు ఖరారు చేస్తామని మంత్రి వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.