అసైన్మెంట్ భూముల రెగ్యులేషన్‌కు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీసుకొచ్చిన జీవో నంబర్ 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ మేరకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. అసైన్మెంట్ భూముల విషయంలో రైతులు, పేదలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.



