దుత్తలూరు
Date 30-7-2026( పున్నమి ప్రతినిధి )
దుత్తలూరు మండలం చింతలకుంట NH 565 హైవే పై బద్వేల్ నుండి పామూరు వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ అయి అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ సంఘటన లో ఒకరు మృతి చెందగ , 12 మందికి గాయాలు అయినాయి.
వాహనంలో ఈవెంట్ డెకరేషన్‌కు సంబంధించిన ఇనుప ఫ్రేములు, కృత్రిమ గడ్డి, అలంకరణ సామగ్రితో పాటు పలువురు కార్మికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు ను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తంఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.




