నందలూరు రైల్వే స్టేషన్లో తిరుపతి–కాచిగూడ మధ్య నడిచే వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ దక్షిణ మధ్య రైల్వే గుంటకల్ డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్ గుప్తా కు నందలూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తరఫున వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ—
వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నందలూరులో ఆగితే ఈ ప్రాంత ప్రజలకు,
విద్యార్థులకు,ఉద్యోగస్తులకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.రైల్వే ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుందని, తిరుపతి మరియు హైదరాబాద్ దిశగా వెళ్లే వారికి ఇది పెద్ద సదుపాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నరసింహస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఎంను శాలువాతో సన్మానించి,అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.వినతిపై స్పందించిన డివిజనల్ మేనేజర్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ విషయాన్ని పరిశీలిస్తాము అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ కోసం డిఆర్ఎంకు వినతి పత్రం
నందలూరు రైల్వే స్టేషన్లో తిరుపతి–కాచిగూడ మధ్య నడిచే వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ దక్షిణ మధ్య రైల్వే గుంటకల్ డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్ గుప్తా కు నందలూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తరఫున వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ— వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నందలూరులో ఆగితే ఈ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు,ఉద్యోగస్తులకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.రైల్వే ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుందని, తిరుపతి మరియు హైదరాబాద్ దిశగా వెళ్లే వారికి ఇది పెద్ద సదుపాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నరసింహస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఎంను శాలువాతో సన్మానించి,అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.వినతిపై స్పందించిన డివిజనల్ మేనేజర్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ విషయాన్ని పరిశీలిస్తాము అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

