ఏర్పేడు, ఆగస్టు 17, (పున్నమి న్యూస్): జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఏర్పేడు మండలం, రాజులపాలెం ఎంపీపీఎస్ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు విద్యా సామాగ్రిని సోమవారం ఘనంగా పంపిణీ చేశారు. జనసేన పార్టీ వీర మహిళ, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత ద్వితీయ కుమార్తె దీపిక జన్మదినాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పలకలు, ప్యాడ్లు, బాక్సులు మరియు అవసరమైన విద్యా సామాగ్రిని పేట బ్రదర్స్ మిత్రబృందంతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో కూడా రాణించాలనే ఉద్దేశంతో పాఠశాలకు అవసరమైన పలు రకాల ఆట వస్తువులను, క్రీడా పరికరాలను త్వరలోనే తమ తరఫున ఉచితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విద్యా సేవకు సహకరించిన మండల కోఆర్డినేటర్ ప్రగతి శిరీష, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ మురగయ్య, వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరికృష్ణ మరియు ఉపాధ్యాయులకు జనసేన నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, కళ్లిపూడి వెంకటేష్, మనీ, రాజేష్ రెడ్డి, చందు, చల్ల హరికృష్ణ, చల్ల నవీన్, దివాకర్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, దీపిక తదితరులు పాల్గొన్నారు.

రాజులపాలెం పాఠశాలలో జనసైనికుల ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ