
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత బాసట “కళ్యాణ లక్ష్మి” పథకం: బిఆర్ఎస్ (బిఆర్ఎస్) గ్రామ శాఖ అధ్యక్షులు చిరంజీవిచిన్నగూడూరు, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత బాసటగా నిలిచిన “కళ్యాణ లక్ష్మి” పథకం ప్రారంభమై నేటికి విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తయినట్లు చిన్నగూడూరు మండలం మెగ్యా తండా బిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిరంజీవి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) గారు ఎంతో దూరదృష్టితో, మానవీయ కోణంలో ఈ అద్భుతమైన పథకానికి రూపకల్పన చేశారని కొనియాడారు. ఈ మహత్తర పథకానికి “కళ్యాణ లక్ష్మి” అనే అద్భుతమైన పేరును సూచించింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారేనని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఒక మేనమామలా అండగా నిలిచిన అపూర్వమైన పథకం ఇదని ఆయన స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని అన్ని కులాల, వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకుందని విమర్శించారు. అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ హామీలను బూడిదలో పోసిన పన్నీరులా మార్చి, పేద కుటుంబాలను నట్టేట ముంచుతూ తీవ్రంగా మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలను నమ్మి మోసపోయామని ఈరోజు పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. ఉప సర్పంచ్ గుగులోత్ వీరన్న.చిన్నగూడూరు మండల BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు. బాదావత్ సురేష్. వార్డు సభ్యులు. బాదావత్ బద్రి లక్ష్మణ్. గుగులోత్ సావిత్రి రఘు. బాదావతి వెన్నెల శ్రీకాంత్. భూక్య రవి. తదితరులు పాల్గొన్నారు

