మండలంలోని వేములపాడులో శుక్రవారం నాలుగు వరి గడ్డివాములు ఒకేసారి దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో 3 వేలకు పైగా గడ్డి మోపులు పూర్తిగా బూడిదయ్యాయి. గ్రామానికి చెందిన కుసుపాటి ఏసోబు, చేవూరి రవి, పోతల సురేంద్రలకు చెందిన వరి గడ్డివాములు పక్కపక్కనే ఉండగా, ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వాటికి వ్యాపించాయి. సమీపంలోని పందల అలివేలమ్మకు చెందిన గేదెలకు కూడా మంటలు వ్యాపించి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన ముగ్గురు రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.



