Saturday, 3 October 2026
  • Home  
  • శ్రీ సిటీలో టిల్ హెల్త్ కేర్ కంపెనీలో భారీ పేలుడు – భారీ ప్రాణ నష్టం అంచనా*
- తిరుపతి

శ్రీ సిటీలో టిల్ హెల్త్ కేర్ కంపెనీలో భారీ పేలుడు – భారీ ప్రాణ నష్టం అంచనా*

*సత్యవేడు, అక్టోబర్ 03* తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ కంపెనీలో శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలోని ఒక విభాగం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో నైట్ షిఫ్ట్ ముగించుకుని, మార్నింగ్ షిఫ్ట్ కోసం విధుల్లో ఉన్న పలువురు కార్మికులు పేలుడులో చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. అక్కడికక్కడే భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది మరియు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

*సత్యవేడు, అక్టోబర్ 03* తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ కంపెనీలో శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.

పేలుడు ధాటికి పరిశ్రమలోని ఒక విభాగం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో నైట్ షిఫ్ట్ ముగించుకుని, మార్నింగ్ షిఫ్ట్ కోసం విధుల్లో ఉన్న పలువురు కార్మికులు పేలుడులో చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. అక్కడికక్కడే భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది మరియు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

పేలుడుకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.