ఖమ్మం నిర్మల్ హృదయ్ స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం తీవ్రంగా బాధాకరమని హెట్రో అధినేత, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బి. పార్థసారథి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాంబశివ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని పార్థసారథి రెడ్డి గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాంబశివ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బ్రష్న ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఖమ్మం కార్పొరేషన్బ మాజీ డిప్యుటీ మేయర్త్తు బత్తుల మురళి పాల్గొన్నారు.


