*
సూళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఎస్ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో బైక్లను ఆపి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.
వాహనదారులు ప్రాణ రక్షణ కోసం విధిగా హెల్మెట్ ధరించి, భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు.

