Thursday, 3 September 2026
  • Home  
  • అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన.. హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మ దహనం
- ప్రకాశం

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన.. హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మ దహనం

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన.. హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మ దహనం కందుకూరు: నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను కల్పిత నాయకుడిగా చిత్రీకరిస్తున్నారంటూ నాగులరపు వరప్రసాద్‌ అలియాస్‌ హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కందుకూరు సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా మాలల జేఏసీ కార్యదర్శి చిడితోటి శ్రీరాములు ఆధ్వర్యంలో హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు “కల్పిత నాయకుడు” పుస్తకాన్ని రద్దు చేయాలని, హమారా ప్రసాద్‌పై ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ విలువలను అవమానించే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు, ప్రకాశం జిల్లా మాలల జేఏసీ అధ్యక్షుడు కొండలరావు, జైభీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు, బీవీ రావు, రాజు, చిరంజీవి, క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడుతామని వారు తెలిపారు.

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన.. హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మ దహనం
కందుకూరు: నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను కల్పిత నాయకుడిగా చిత్రీకరిస్తున్నారంటూ నాగులరపు వరప్రసాద్‌ అలియాస్‌ హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కందుకూరు సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా మాలల జేఏసీ కార్యదర్శి చిడితోటి శ్రీరాములు ఆధ్వర్యంలో హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు “కల్పిత నాయకుడు” పుస్తకాన్ని రద్దు చేయాలని, హమారా ప్రసాద్‌పై ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ విలువలను అవమానించే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు, ప్రకాశం జిల్లా మాలల జేఏసీ అధ్యక్షుడు కొండలరావు, జైభీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు, బీవీ రావు, రాజు, చిరంజీవి, క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడుతామని వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.