పున్నమి న్యూస్ ఆగష్టు 6: అంగవైకల్యం కోటాలో ఉద్యోగం రావాల్సి ఉన్నప్పటికీ అధికారులు చేసిన తప్పిదం వల్ల తీవ్రంగా నష్టపోయారని ఇదే విషయమై న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువులో డిఎస్సీ అభ్యర్థి అంజనప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఓబుల దేవర చెరువు మండలం తుమ్మలకుంట్లపల్లికి చెందిన అంజనప్ప మాట్లాడుతూ తనకు 100% అంగవైకల్యం ఉన్నప్పటికీ 30 శాతం మాత్రమే ఉన్నట్లు వైద్యాధికారులు నివేదిక ఇవ్వడం వల్ల ఉద్యోగ అర్హత కోల్పోయాను అన్నారు. ఇదే విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కలెక్టర్ సిఫార్సుతో మరోసారి వైద్య పరీక్షల నిర్వహించిన 40 శాతం మాత్రమే వైకల్యం ఉన్నట్లు చెప్పడం దారుణం అన్నారు. అధికారులు కుంటి సాకులు చూపుతూ తన జీవితాన్ని నాశనం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వైకల్యం ఉన్న తనను ఆదుకోవాలని ఆయన కోరారు.
Uploaded Video:

