పున్నమి న్యూస్ ఆగష్టు 06: డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు తహసిల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. ఎంతోమంది నిరుద్యోగులు ఆశతో డీఎస్సీ పరీక్షలు రాస్తే ఇలా అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పెద్దలు నిరుద్యోగులకు ఎందుకు భృతి చెల్లించడం లేదన్నారు. కరువు పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుంటే వారి సమస్యలను ఎందుకు నిర్లక్ష్యంగా చూస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని, నిరుద్యోగుల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న డీఎస్సీ లో జరిగిన అక్రమాలకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Uploaded Video:

