విశాఖపట్నం ఆగస్టు 6:
గురువారం డాక్టర్ బి ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల హెల్ప్ ద బ్లైండ్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ వాల్తేరు వారి ఆర్ధిక సహాయం తో అంధ విద్యార్థుల కు కంప్యూటర్ లాబ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.మంజుల విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని,మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని అభిప్రాయా పడ్డారు.డాక్టర్ ఐ.విజయబాబు,ప్రిన్సిపల్ విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మాట్లాడుతూ విద్యార్థులందరూ ఫౌండేషన్ వారు అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజంలో ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. హెల్ప్ ది బ్లైండ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ యన్. శివాజీ మాట్లాడుతూ ఆ సంస్థ అంధ విద్యార్థులకు అందించే వివిధ సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పి .ధనలక్ష్మి,డివిఎల్ తేజస్వి, రోటరీ క్లబ్ వాల్తేరు వాలంటీర్ ఎం. వి. నారాయణ రావు ప్రెసిడెంట్, ఎస్. అజయ్ కుమార్ సెక్రటరీ విప్లవ కుమారు , ఇతర వాలంటీర్స్, అధ్యాపకులు మరియువిద్యార్థులు పాల్గొన్నారు.


