ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ కె. హరిత
జూలై 30, 2026 | గురువారం
జిల్లా కేంద్రం: జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జూలై 30, 2026 గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని ఆమె సూచించారు.
భారీ వర్షాల సమయంలో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక అప్రమత్తత పాటించాలని కలెక్టర్ కోరారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని, వాగులు, ఓర్రెలు, బావులు, డ్రైనేజీలు వంటి ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల తీవ్రత దృష్ట్యా అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్
ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
📞 కంట్రోల్ రూమ్ నంబర్: 8500844365
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ కె. హరిత కోరారు.


