Saturday, 29 August 2026
  • Home  
  • హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి ఐసీటీసీ కౌన్సిలర్ కె ప్రతాప్ చే అమలాపురం డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అవగాహన
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి ఐసీటీసీ కౌన్సిలర్ కె ప్రతాప్ చే అమలాపురం డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అవగాహన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం ఎర్రవంతెన వద్దగల అమలాపురం డిగ్రీ కళాశాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె సూరిబాబు, బి రమేష్ సమక్షంలో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,జనకళ్యాణ్ ప్రివెన్షన్ యూనిట్, సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి ఐసీటీసీ కౌన్సిలర్ కె ప్రతాప్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, క్యూఆర్ కోడ్ తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చెయ్యటం జరిగింది అలాగే క్కు ఆర్ కోడ్ స్కాన్ తో విద్యార్థులతో సెల్ఫ్ రిస్క్ అస్సేస్మెంట్ ఫ్రొం ను పూర్తి చేయించారు. ఈ కార్యక్రమంలో దిశా,జనకళ్యాణ్ ప్రాజెక్ట్ , ఏఎన్ఎం కె. వెంకటరమణ, పీర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల ఐసీటీసీ కౌన్సిలర్ మరియు అమలాపురం డిగ్రీ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం ఎర్రవంతెన వద్దగల అమలాపురం డిగ్రీ కళాశాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె సూరిబాబు, బి రమేష్ సమక్షంలో
హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,జనకళ్యాణ్ ప్రివెన్షన్ యూనిట్, సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి ఐసీటీసీ కౌన్సిలర్ కె ప్రతాప్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, క్యూఆర్ కోడ్ తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చెయ్యటం జరిగింది అలాగే క్కు ఆర్ కోడ్ స్కాన్ తో విద్యార్థులతో సెల్ఫ్ రిస్క్ అస్సేస్మెంట్ ఫ్రొం ను పూర్తి చేయించారు.
ఈ కార్యక్రమంలో దిశా,జనకళ్యాణ్ ప్రాజెక్ట్ , ఏఎన్ఎం కె. వెంకటరమణ, పీర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల ఐసీటీసీ కౌన్సిలర్ మరియు అమలాపురం డిగ్రీ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.