Saturday, 29 August 2026

Tag: Konaseema

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి ఐసీటీసీ కౌన్సిలర్ కె ప్రతాప్ చే అమలాపురం డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అవగాహన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం ఎర్రవంతెన వద్దగల అమలాపురం డిగ్రీ కళాశాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె సూరిబాబు, బి రమేష్ సమక్షంలో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,జనకళ్యాణ్ ప్రివెన్షన్ యూనిట్, సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి ఐసీటీసీ కౌన్సిలర్ కె ప్రతాప్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు, సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, క్యూఆర్ కోడ్ తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చెయ్యటం జరిగింది అలాగే క్కు ఆర్ కోడ్ స్కాన్ తో విద్యార్థులతో సెల్ఫ్ రిస్క్ అస్సేస్మెంట్ ఫ్రొం ను పూర్తి చేయించారు. ఈ కార్యక్రమంలో దిశా,జనకళ్యాణ్ ప్రాజెక్ట్ , ఏఎన్ఎం కె. వెంకటరమణ, పీర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల ఐసీటీసీ కౌన్సిలర్ మరియు అమలాపురం డిగ్రీ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

1326వ రోజుకు చేరుకున్న లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మర్పం లయన్స్ ఉచిత భోజన పథకం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తాళ్లరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగుతున్న లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై గురువారం నాటికి 1326 వ రోజుకు చేరుకుంది. అన్నదాత లయన్స్ బ్రహ్మర్పణ్ ట్రస్ట్ ద్వారా అభాగ్యులకు భోజనములు లయన్స్ క్లబ్ సభ్యులచే ఏర్పాటు చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి చొరవతో పశ్చిమ బెంగాల్ నుంచి ఏడుగురు మత్స్యకారుల సురక్షిత స్వస్థల ప్రయాణం ప్రారంభం డ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారుల సురక్షిత రాక కోసం అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి.ఎం. హరీష్ బాలయోగి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రమంత్రితో సైతం ఆయన ఈ విషయంలో మాట్లాడారు.మత్స్యకారుల ఆచూకీ లభించిన వెంటనే, పశ్చిమ బెంగాల్ మెరైన్ డీఐజీతో పాటు అక్కడి ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, మత్స్యకారులను సురక్షితంగా పశ్చిమ బెంగాల్ నుంచి స్వస్థలమైన అమలాపురానికి తరలించే ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ నుంచి అమలాపురం వైపు బయలుదేరారు. వారి ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నేరుగా స్వగ్రామాలకు చేరుకునేందుకు అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి ప్రత్యేకంగా టెంపో ట్రావెలర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.మత్స్యకారులు తమ కుటుంబ సభ్యుల వద్దకు క్షేమంగా చేరుకునే వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎంపీ హరీష్ బాలయోగి స్వయంగా పర్యవేక్షిస్తూ, ప్రతి దశలో సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా మత్స్యకారుల సురక్షిత రాక కోసం సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పశ్చిమ బెంగాల్ అధికారులు మరియు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎంపీ శ్రీ జి.ఎం. హరీష్ బాలయోగి కృతజ్ఞతలు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం ఎంతో ఆనందం కలిగించింది___శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి వేటకు వెళ్లి గత 23 రోజులుగా ఆచూకీ లేకుండా ఉన్న ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం అందడం ఎంతో ఆనందం కలిగించిందని శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు.ఈ సందర్భంగా క్షేమంగా పశ్చిమ బెంగాల్ తీరంలో ఉన్న బాధితులతో దాట్ల సుబ్బరాజు మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే సొంత ఇళ్లకు చేరే ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మత్స్యకారుల కోసం గత 23 రోజులుగా నిరంతరం గాలింపు చర్యలు చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు, సహకరించిన అధికారులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం అభినందనీయమన్నారు. ఏడుగురు మత్స్యకారులు త్వరితగతిన సురక్షితంగా తమ స్వగ్రామాలకు చేరుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. గత 23 రోజులుగా ఆందోళనలో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపిన ఈ శుభవార్త ఎంతో సంతోషాన్ని కలిగించిందని దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.