Friday, 14 August 2026
  • Home  
  • స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినికేతన్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా వేడుకలు
- విశాఖపట్నం

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినికేతన్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా వేడుకలు

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 13: MVP కాలనీలోని శాంతి నికేతన్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో సుమన్, ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ నిపుణులు క్యోషి సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. పాఠశాల డైరెక్టర్ వి. షణ్ముఖ రావు, కరస్పాండెంట్ కె. సాయి చంద్రిక, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రవీణ్ ప్రముఖ అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్యోషి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు క్రీడా రంగంలో మరింతగా రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రముఖ అతిథుల సమక్షంలో వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రముఖులు పాఠశాలకు విచ్చేసి విద్యార్థులను ప్రోత్సహించడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దేశభక్తి, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణతో సాగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్సాహం, స్ఫూర్తిని నింపుతూ విజయవంతంగా ముగిసింది.

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 13: MVP కాలనీలోని శాంతి నికేతన్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో సుమన్, ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ నిపుణులు క్యోషి సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.

పాఠశాల డైరెక్టర్ వి. షణ్ముఖ రావు, కరస్పాండెంట్ కె. సాయి చంద్రిక, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రవీణ్ ప్రముఖ అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

క్యోషి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు క్రీడా రంగంలో మరింతగా రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రముఖ అతిథుల సమక్షంలో వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రముఖులు పాఠశాలకు విచ్చేసి విద్యార్థులను ప్రోత్సహించడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దేశభక్తి, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణతో సాగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్సాహం, స్ఫూర్తిని నింపుతూ విజయవంతంగా ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.