శ్రీ కాళహస్తి, ఆగస్టు 13, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా 90వ వారానికి చేరుకుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు అత్యంత శ్రద్ధతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ గుప్పెడు మెతుకులు అందించాలనే పవన్ కళ్యాణ్ సదాశయానికి మద్దతుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వారపు అన్నదాన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రముఖ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవిలతో పాటు గంధం శ్రీను, తేజ, మహేష్, మనీ, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్, దినేష్, నవీన్, చల్ల హరి, చల్ల నవీన్, చందు, జానీ, సాయి, రాజా పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ తదితర జనసేన వీరమహిళలు పాల్గొని అన్నప్రసాద వితరణలో భాగస్వాములయ్యారు. వారం వారం క్రమం తప్పకుండా పేదలకు ఆహారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పేట బ్రదర్స్ మరియు జనసేన నాయకుల సేవా నిరతిపై స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాళహస్తిలో 90వ వారానికి చేరిన ‘డొక్కా సీతమ్మ’ అన్నదాన కార్యక్రమం