Monday, 18 May 2026
  • Home  
  • సర్వే నెం.26లో ఆక్రమణలు నిరోదించండి
- ఆంధ్రప్రదేశ్

సర్వే నెం.26లో ఆక్రమణలు నిరోదించండి

విశాఖపట్నం, మే18(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్): విశాఖపట్నం నగర శివారు పెందుర్తి ప్రాంతంలో రోజురోజుకు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. నిరోధించాల్సిన రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది చేష్టలుడిగి చూస్తున్నారు తప్ప, కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా వేపగుంటదరి వరలక్ష్మి నగర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 26 ప్రభుత్వం భూమిలో ఆక్రమణలు యదేచ్ఛగా జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఇక్కడ 60, 100 గజాలు లెక్కన స్థలాలను ప్లాట్లు గా విభజించి, రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు అమ్మకాలు చేసేస్తున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది వీరికి లోపాయికారిగా సహకారం అందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 11 ఎకరాలు విస్తీర్ణం గల ఈ ప్రభుత్వ భూమి ఇప్పటికే మూడు వంతులు కబ్జాదారుల పరం కాగా, మిగిలింది కూడా అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై స్థానిక దళిత నాయకుడు జల్లు బాబు ఆధ్వర్యంలో స్థానికులు సోమవారం పెందుర్తి తహసిల్దార్ వెంకట అప్పారావు కు, అలాగే జీవీఎంసీ పెందుర్తి జోనల్ అధికారి శంకర్రావుకు ఆక్రమణలు నిరోధించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వ స్థలాలను యదేచ్ఛగా ఆక్రమించి అమ్మకాలు చేయడం వల్ల గతంలో ఇక్కడ ఇల్లు నిర్మించుకున్న వారికి కనీసం రహదారులు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో వృద్ధులు, చిన్నారులు అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. దీనిపై తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేసినట్టు :

విశాఖపట్నం, మే18(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్):

విశాఖపట్నం నగర శివారు పెందుర్తి ప్రాంతంలో రోజురోజుకు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. నిరోధించాల్సిన రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది చేష్టలుడిగి చూస్తున్నారు తప్ప, కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా వేపగుంటదరి వరలక్ష్మి నగర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 26 ప్రభుత్వం భూమిలో ఆక్రమణలు యదేచ్ఛగా జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఇక్కడ 60, 100 గజాలు లెక్కన స్థలాలను ప్లాట్లు గా విభజించి, రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు అమ్మకాలు చేసేస్తున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది వీరికి లోపాయికారిగా సహకారం అందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 11 ఎకరాలు విస్తీర్ణం గల ఈ ప్రభుత్వ భూమి ఇప్పటికే మూడు వంతులు కబ్జాదారుల పరం కాగా, మిగిలింది కూడా అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై స్థానిక దళిత నాయకుడు జల్లు బాబు ఆధ్వర్యంలో స్థానికులు సోమవారం పెందుర్తి తహసిల్దార్ వెంకట అప్పారావు కు, అలాగే జీవీఎంసీ పెందుర్తి జోనల్ అధికారి శంకర్రావుకు ఆక్రమణలు నిరోధించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వ స్థలాలను యదేచ్ఛగా ఆక్రమించి అమ్మకాలు చేయడం వల్ల గతంలో ఇక్కడ ఇల్లు నిర్మించుకున్న వారికి కనీసం రహదారులు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో వృద్ధులు, చిన్నారులు అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. దీనిపై తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేసినట్టు

:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.