పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 05)
వేముల: పల్లె పండుగ 3.0లో భాగంగా వేముల గ్రామ పంచాయతీలో పశువుల షెడ్ నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మేడం, మండల టీడీపీ నాయకులు పేర్ల శేష రెడ్డి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా MPDO మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రైతులు, పశుపోషకులకు అవసరమైన సదుపాయాలను కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో ప్రజలకు నేరుగా ఉపయోగపడే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారి, బెర్ఫుట్ టెక్నీషియన్, ఫీల్డ్ అసిస్టెంట్, పశువుల షెడ్ లబ్ధిదారుడు, NDA కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




